AP DSC Chittoor Nellore District-Wise Posts Online Application Updates Hall tickets apdsc.cgg.gov.in: దేశవ్యాప్తంగా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం నిర్వహణ

Blink tag

AP D.S.C in Chittoor and all districs A Wish I wish Bestof Luck and GoodLuck SUJI

Thursday 15 January 2015

దేశవ్యాప్తంగా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం నిర్వహణ

  12 జనవరి 2015 స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం  దేశవ్యాప్తంగా  జాతీయ యువజన దినోత్సవం నిర్వహణ.
స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా దేశవ్యాప్తంగా నిర్వహించారు. భారత ప్రభుత్వం 1985 నుంచి ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నది. 2015 సంవత్సర జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద యొక్క 152వ జయంతి ఉత్సవాలను జరుపుకొన్నారు.
యువతలో దాగున్న నిగూఢశక్తిని వెలికితీయుటకు వివేకానందుడి రచనలు, ఆలోచనల దృక్పథం మరియు విలువలను అందరికీ తెలియజేయడం ఈ దినోత్సవ నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం

స్వామీ వివేకానంద గురించి :


• స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902) ప్రసిద్ధ హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. ఆయన రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు.
• ఆయన హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలో ఒక ప్రముఖ వ్యక్తి. ఆయన రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
• ఆయన తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండు లలో యోగ, వేదాంత శాస్త్రములను పరిచయం చేశారు. పాశ్చాత్య దేశాలలో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఆయన.
• ఆయన భారత దేశ తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనం (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893లో ప్రపంచానికి చాటిచెప్పారు.
• స్వామీ వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశారు. ఆయన ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసులో 4 జూలై 1902న పశ్చిమబెంగాల్ లోని బెలూర్ లో మరణించారు.

No comments:

Post a Comment


Get paid to share your links!